Authorization
Fri April 04, 2025 08:54:54 pm
- అధ్యక్ష ఎన్నికలో భూటియా ఓటమి
న్యూఢిల్లీ : ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) నూతన అధ్యక్షుడిగా మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ మాజీ గోల్ కీపర్ కళ్యాణ్ చౌబే ఎన్నికయ్యారు. సంక్షోభ సమయంలో నిర్వహించిన ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికల్లో భారత ఫుట్‌బాల్ దిగ్గజం బైచుంగ్ భూటియాపై 33-1 ఓట్ల తేడాతో కళ్యాణ్ చౌబే విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ తరఫున క్రీయాశీల రాజకీయాల్లో ఉన్న కళ్యాణ్ చౌబే.. రాజకీయ ఎత్తుగడతో ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్ష పీఠం దక్కించుకున్నాడు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చవిచూసిన భూటియా.. మాజీ ఆటగాడిగా కో ఆప్టెడ్ సభ్యుడిగా కొనసాగనున్నాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ సంఘాల ప్రతినిధులు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏఐఎఫ్ఎఫ్ నూతన పాలక వర్గం నేడు బాధ్యతలు స్వీకరించనుంది. అక్టోబర్‌లో నిర్వహించనున్న ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్ అధ్యక్షుడిగా చౌబే పనితీరుకు తొలి సవాల్‌గా నిలువనుంది. ఫుట్‌బాల్ అభివృద్దిలో ఎప్పటి మాదిరిగానే భాగం పంచుకుంటానని భూటియా తెలిపాడు.