Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలిమినేటర్‌లో చెన్నైపై ఘన విజయం
పుణె : తెలుగు యోధాస్ అద్భుత ప్రదర్శన చేసింది. అల్టిమేట్ ఖోఖో లీగ్ తొలి సీజన్లో క్వాలిఫయర్ 2కు అర్హత సాధించింది. శుక్రవారం పుణెలో జగిన ఎలిమినేటర్‌లో చెన్నై క్విక్ గన్స్‌ను తెలుగు యోధాస్ చిత్తు చేసింది. 61-43తో దుమ్మురేపిన తెలుగు యోధాస్ 18 పాయింట్ల తేడాతో చెన్నై క్విక్గన్స్ను ుట్టికరిపించింది. తెలుగు యోధాస్ కెప్టెన్ ప్రతీక్ వారుకర్ 6.43 నిమిషాల డిఫెన్స్‌తో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3.44 నిమిషాల డిఫెన్స్‌తో ప్రతీక్ తెలుగు యోధాస్‌ను ముందంజలో నిలిపాడు. అటాకింగ్‌లో ఆదర్శ్ మోహిత్ ఆకట్టుకున్నాడు. 16 పాయింట్లతో మెరిసి తెలుగు జట్టును గెలుపు పథాన నిలిపాడు. ఆరుగురు ఆటగాళ్లను వెనక్కి పంపించిన ఆదర్శ్ మోహిత్.. అందులో నలుగురిని కండ్లుచెదిరే డైవ్స్తో సాగనంపాడు. చెన్నై తరుఫున డిఫెన్స్‌లో అమిత్ పాటిల్ (3.59 నిమిషాలు), మదన్ (8 పాయింట్లు) రాణించారు. ఫైనల్లో చోటు కోసం క్వాలిఫయర్ 2 శనివారం జరుగనుంది.
రన్నరప్ సాయికార్తీక్
ఆల్ ఇండియా నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో తెలంగాణకు చెందిన ఆటగాడు సాయికార్తీక్ రెడ్డి రన్నరప్‌గా నిలిచాడు. హైదరాబాద్‌లోని సానియా మీర్జా అకాడమీలో జరిగిన టైటిల్ పోరులో మనీశ్ (కర్ణాటక)తో మూడు సెట్ల మ్యాచ్‌లో 7-5, 4-6, 2-6తో సాయికార్తీక్ పోరాడి ఓడాడు. రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు.