Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్పిన్ వేయటంలోనే కాదు ఆడటంలోనూ ఆసియా క్రికెటర్లకు ఎదురులేదు. ప్రపంచ క్రికెట్ ఏండ్లుగా నమ్మిన మాట ఇది. కానీ, ఆధునిక క్రికెట్లో అందుకు కాస్త భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. బంతిని గింగిరాలు తిప్పే కళలో అగ్రగామిగా కొనసాగుతున్నా..టర్న్ అవుతున్న బంతిని ఆడటంలో మాత్రం ఇబ్బంది పడుతున్నారు. అందుకు భారత్, పాకిస్థాన్ బ్యాటర్లు మినహాయింపు కాదు. ప్రధానంగా భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లు స్పిన్‌పై స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడరు. నేరుగా ఆడేందుకు మొగ్గుచూపుతారు. నిజానికి, ఇలా ఆడటంలోనే మనోళ్లు విజయవంతమయ్యారు. ఇటీవల కాలంలో స్పిన్ బౌలర్లపై భారత బ్యాటర్ల తడబాటు ఆందోళన కలిగిస్తోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం స్పిన్‌పై పరుగుల వేటకు, ఎదురుదాడికి వెనుకంజ వేస్తున్నారు. పాక్‌తో తొలి మ్యాచ్‌లో రోహిత్, విరాట్, జడేజాలు స్పిన్ బౌలింగ్‌లోనే వికెట్ కోల్పోయారు. నేడు దుబారులో సూపర్ 4 సమరంలోనూ స్పిన్ ఎక్స్ ఫ్యాక్టర్ పాత్ర పోషించనుంది.