Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వాలిఫయర్2లో గుజరాత్‌పై గెలుపు
- టైటిల్ పోరులో ఒడిశాతో పోరుకు సై
- అల్టిమేట్ ఖోఖో లీగ్ సీజన్ 1
నవతెలంగాణ-పుణె : అల్టిమేట్ ఖోఖో లీగ్ తొలి సీజన్లో తెలుగు యోధాస్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం పుణెలో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన క్వాలిఫయర్ 2 సమరంలో తెలుగు యోధాస్ అద్భుత ప్రదర్శన చేసింది. అటాక్, డిఫెన్స్‌లో ఎదురులేని ఆధిపత్యం చెలాయించిన తెలుగు యోధాస్ టైటిల్ పోరుకు చేరుకుంది. గుజరాత్‌ను అన్ని విభాగాల్లోనూ చిత్తు చేసిన తెలుగు యోధాస్ 67-44తో 23 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. నేడు జరుగనున్న మెగా ఫైనల్లో ఒడిశా జాగర్నాట్స్తో తెలుగు యోధాస్ తలపడనుంది. క్వాలిఫయర్ 2లో పరాజయం పాలైన గుజరాత్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. గుజరాత్ జెయింట్స్ రూ.30 లక్షల నగదు బహుమతి అందుకోనుంది. నేడు అల్టిమేట్ ఖోఖో లీగ్ టైటిల్ పోరు రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. సోనీ నెట్‌వర్క్‌లో ఫైనల్ పోరు ప్రసారం కానుంది.
తెలుగు యోధాస్ వరుస విజయాల జోరు క్వాలిఫయర్ 2లోనూ కొనసాగింది. లీగ్ దశ చివర్లో గుజరాత్ సీజన్లోనే భారీ విజయం నమోదు చేసిన తెలుగు యోధాస్.. శనివారం అదే ప్రదర్శన పునరావృతం చేశారు. కెప్టెన్ ప్రజ్వాల్ అటాక్‌లో అదరగొట్టాడు. స్కై డైవ్, పోల్ డైవ్స్తో చెలరేగి 14 పాయింట్లు సాధించాడు. కెప్టెన్‌కు ప్రతీక్, సచిన్ జత కలవటంతో గుజరాత్ జెయింట్స్ తేలిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 39-21తో విలువైన ఆధిక్యం సాధించిన తెలుగు యోధాస్.. రెండో ఇన్నింగ్స్‌లో ఎక్కడా తగ్గలేదు. 67-44తో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసి ఫైనల్లోకి ప్రవేశించింది.