Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరల్డ్‌కప్‌లో భారత్ వార్మప్ షెడ్యూల్
దుబాయ్ : ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచుల్లో భారత్ బలమైన జట్లతో తలపడనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, మాజీ చాంపియన్ న్యూజిలాండ్‌లతో టీమ్ ఇండియా వార్మప్ మ్యాచులు ఆడనుంది. ఈ మేరకు ఐసీసీ 2022 టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచుల షెడ్యూల్ విడుదల చేసింది. బ్రిస్బేన్ గబ్బా స్టేడియంలో అక్టోబర్ 17న ఆస్ట్రేలియాతో ఆడనున్న రోహిత్సే.. అక్టోబర్ 19న న్యూజిలాండ్‌ను ఢకొీట్టనుంది. 16 జట్లు పోటీపడుతున్న మెగా ఈవెంట్లో తొలి రౌండ్లో పోటీపడుతున్న జట్లు అక్టోబర్ 10-13న ప్రాక్టీస్ మ్యాచులు ఆడనుండగా.. సూపర్12 దశ నుంచి పోటీపడే జట్లు అక్టోబర్ 17-19న వార్మప్ బరిలోకి దిగనున్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 16 నుంచి ఆరంభం కానుంది. ఐసీసీ మెగా ఈవెంట్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక పొట్టి ప్రపంచకప్ వేటను భారత్ అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో పోరుతో షురూ చేయనుంది.