Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హుబ్లి : తెలుగు తేజం కెఎస్ భరత్ (74 బ్యాటింగ్, 104 బంతుల్లో 10 ఫోర్లు) అజేయ అర్థ సెంచరీతో కదం తొక్కాడు. న్యూజిలాండ్-ఏతో భారత్-ఏ రెండో అనధికార టెస్టులో వికెట్ కీపర్ బ్యాటర్ అదరగొట్టాడు. ఓపెనర్ ప్రియాంక్ పంచల్ (87, 148 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా బ్యాటింగ్ లైనప్‌లో ఎవరూ రాణించలేదు. అభిమన్యు (22), రుతురాజ్ (5), రజత్ పటీదార్ (4), తిలక్ వర్మ (0)లు నిరాశపరిచారు. 68/4తో జట్టు కష్టాల్లో ఉండగా ప్రియాంక్ పంచల్‌తో జతకట్టిన భరత్ భారత్-ఏకు మెరుగైన స్కోరు అందించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 66 ఓవర్లలో 229/6తో కొనసాగుతోంది. భరత్‌కు తోడుగా రాహుల్ చాహర్ (4 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. శార్దుల్ ఠాకూర్ (26, 57 బంతుల్లో 4 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. కివీస్-ఏ బౌలర్లలో జాకబ్ (2/55), వాన్‌బీక్ (2/39) రాణించారు.