Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయానికి ముంబయిలో శస్త్రచికిత్స చేశారు. ఆసియా కప్‌లో టీమ్ బాండింగ్ సెషన్లో వాటర్ స్పోర్ట్స్ ఆడుతుండగా జడేజా గాయం బారిన పడ్డాడు. జట్టు ట్రైనింగ్ సెషన్లలో లేకపోయినా.. జడేజా ఎందుకు వాటర్‌స్పోర్ట్స్ ఆడాల్సి వచ్చిందనే అంశంపై బోర్డు ఆరా తీస్తోంది. గాయంతో టీ20 వరల్డ్‌కప్‌కు జడేజా దూరం కావటం భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ. జడేజా గాయంపై ఆరా తీస్తోన్న బీసీసీఐ.. జట్టు మేనేజ్మెంట్ నుంచి నివేదిక కోరనున్నట్టు సమాచారం. ఇక చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఈ అంశంలో ఇప్పటి వరకు పెదవి విప్పలేదు.