Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : వరల్డ్ నం.1 ఇగా స్వైటెక్ (పొలాండ్) యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. నేడు జరిగే టైటిల్ పోరులో ట్యునిషియా భామ ఒన్స్ జబిర్తో స్వైటెక్ తాడోపేడో తేల్చుకోనుంది. సెమీఫైనల్లో సబలెంకపై 3-6, 6-1, 6-4తో స్వైగా మూడు సెట్ల మ్యాచ్‌లో గెలుపొందింది. తొలి సెట్ కోల్పోయినా..ఏడు బ్రేక్ పాయింట్లతో మెరిసిన స్వైటెక్ వరుసగా చివరి రెండు సెట్లను గెల్చుకుని ఫైనల్స్‌కు చేరుకుంది. మరో సెమీస్‌లో కరొలియా గార్సియా (ఫ్రాన్స్)పై ఒన్స్ జబిర్ వరుస సెట్లలో విజయం సాధించింది. 6-1, 6-3తో కరొలినాను చిత్తు చేసి తుది పోరులో అడుగుపెట్టింది. మెన్స్ సింగిల్స్ ఫైనల్ బెర్త్ కోసం కాస్పర్ రూడ్, కచనోవ్.. ఫ్రాన్సెస్ టియాఫొ, కార్లోస్ అల్కారాజ్లు అమీతుమీ తేల్చుకోనున్నారు.