Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్ కెప్టెన్ సంచలన నిర్ణయం
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా వైట్‌బాల్ ఫార్మాట్ కెప్టెన్ అరోన్ ఫించ్ (35) వన్డే క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. కొంతకాలంగా 50 ఓవర్ల ఫార్మాట్లో పేలవంగా ఆడుతున్న అరోన్ ఫించ్..చివరి 12 వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా ఐదు సార్లు సున్నా పరుగులకే వికెట్ కోల్పోయాడు. తాజాగా న్యూజిలాండ్‌పై వన్డేలోనూ అరోన్ ఫించ్ డకౌట్ అయ్యాడు. వరుస వైఫల్యాలతో వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని అరోన్ ఫించ్ నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు నేడు న్యూజిలాండ్‌తో వన్డేతో చివరి ఆట ఆడనున్నట్టు ఫించ్ ప్రకటించాడు. 2023 వన్డే వరల్డ్‌కప్ మెరుగైన నాయకుడి కెప్టెన్సీలో సన్నద్ధం అయ్యేందుకు ఆస్ట్రేలియాకు ఓ అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపాడు. 145 వన్డేల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించిన ఫించ్.. 141 ఇన్నింగ్స్‌ల్లో 5401 పరుగులు చేశాడు. 17 శతకాలతో వన్డే ఫార్మాట్లో తనదైన ముద్ర వేశాడు. వన్డేలకు వీడ్కోలు పలికినా, టీ20ల్లో కొనసాగుతున్నట్టు ఫించ్ తెలిపాడు.