Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పుకున్న నీరజ్, సింధు, సైనా
న్యూఢిల్లీ : సుదీర్ఘ విరామం అనంతరం జరుగుతున్న జాతీయ క్రీడలకు స్టార్ అథ్లెట్లు దూరంగా ఉంటున్నారు!. సెప్టెంబర్ 28 నుంచి గుజరాత్‌లోని ఆరు నగరాలు వేదికగా జాతీయ క్రీడలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఈ జాతీయ క్రీడలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎలైట్ అథ్లెట్లు అందరూ క్రీడల్లో పాల్గొనేలా చూడాలని జాతీయ క్రీడా సమాఖ్యలు, రాష్ట్ర ఒలింపిక్ సంఘాలకు లేఖలు సైతం రాసింది. డైమండ్ లీగ్ టోర్నీలో పసిడి పతకం కొల్లగొట్టి చరిత్ర సృష్టించిన సూపర్‌స్టార్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా జాతీయ క్రీడలకు దూరంగా ఉంటున్నాడు. వచ్చే సీజన్‌కు సన్నద్ధం అయ్యేందుకు విశ్రాంతి తీసుకోవాలని కోచ్ సూచించటంతో చోప్రా ఈ నిర్ణయం తీసుకున్నాడు. స్టార్ షట్లర్లు పి.వి సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్‌లు సైతం జాతీయ క్రీడల్లో పాల్గొనటం లేదని సమాచారం.