Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కివీస్‌పై క్లీన్‌స్వీప్ చేసిన ఆసీస్
మెల్బోర్న్ : బాల్ టాంపరింగ్ వివాదంలో నాయకత్వ బాధ్యతల నుంచి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న డెవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్సీ రేసులో నిలిచాడు. నిషేధంపై సీఏతో చర్చలకు సిద్ధంగా ఉన్నానని వార్నర్ ఇటీవల పేర్కొనగా.. తాజాగా అరోన్ ఫించ్ వన్డేలకు గుడ్ బై పలకటంతో ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్సీ కోసం పోటీ మొదలైంది. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, టెస్టు కెప్టెన్ పాట్ కమిన్స్‌లు సైతం రేసులో ఉన్నారు. దీర్ఘకాలిక ప్రణాళిక కాకుండా, 2023 వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకుని కెప్టెన్‌ను నియమించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది.
ఇక వీడ్కోలు వేళ అరోన్ ఫించ్ వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేశాడు. స్టీవ్ స్మిత్ (105, 131 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో చెలరేగటంతో ఆస్ట్రేలియా 25 పరుగుల తేడాతో మూడో వన్డేలో గెలుపొందింది. మార్నస్ లబుషేన్ (52), అలెక్స్ కేరీ (42) రాణించారు. చివరి ఇన్నింగ్స్‌లో ఫించ్ (5) నిరాశపరిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 267/5 పరుగులు చేసింది. ఛేదనలో న్యూజిలాండ్ 242 పరుగులకు కుప్పకూలింది. మిచెల్ స్టార్క్ (3/60), గ్రీన్ (2/25), అబాట్ (2/31) రాణించారు.