Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్‌తో తొలి టీ20
చెస్టర్ లీ స్ట్రీట్ : బ్యాటర్ల సమిష్ట వైఫల్యంతో ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. ఇంగ్లాండ్ పేసర్ సారా గ్లెన్ (4/23) నిప్పులు చెరిగే ప్రదర్శన చేసింది. మంధాన (23), హర్మన్‌ప్రీత్ కౌర్ (20), దీప్తీ శర్మ (29) మినహా జట్టులో ఎవరూ రాణించలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 132 పరుగులు చేసింది. షెఫాలీ (14), హేమలత (10), రిచా (16) నిరాశపరిచారు. ఛేదనలో ఇంగ్లాండ్ చెలరేగింది. ఓపెనర్ సోఫీ డంక్లీ (61 నాటౌట్, 44 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్థ సెంచరీతో మెరిసింది. డానీ వ్యాట్ (24), అలైస్ (32 నాటౌట్) రాణించటంతో 13 ఓవర్లలోనే ఇంగ్లాండ్ టార్గెట్‌ను చేరుకుంది. 42 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గెలుపొందింది. సిరీస్‌లో రెండో టీ20 మంగళవారం జరుగనుంది. ఇక ఆట పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా.. తొలి టీ20లో ఆడేలా చేశారని భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆవేదన వ్యక్తం చేసింది. అవుట్‌ఫీల్డ్ తడిగా ఉండటంతో రాధ యాదవ్ గాయానికి సైతం గురైనట్టు కౌర్ పేర్కొంది.