Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్, సఫారీ సిరీస్‌కు సిద్ధం
బెంగళూర్ : భారత పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా, యువ పేసర్ హర్షల్ పటేల్ గాయాల నుంచి కోలుకున్నారు!. స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో సిరీస్‌లకు బుమ్రా, హర్షల్ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. బుమ్రా, హర్షల్ కోలుకుని, ఎన్సీఏ నెట్స్‌లో పూర్తి స్థాయిలో బౌలింగ్ సాధన చేశారని బోర్డు వర్గాలు తెలిపాయి. బుమ్రా, హర్షల్ గాయాలతో ఆసియా కప్‌కు దూరం కాగా.. టోర్నీలో భారత్ పేస్ విభాగంలో ఇబ్బందులు చవిచూసింది. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు జట్టును ఎంపిక చేసేందుకు సీనియర్ సెలక్షన్ కమిటీ సెప్టెంబర్ 15న ముంబయిలో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 16 నుంచి ఆరంభం కానున్న 2022 ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్‌కు సైతం జట్టును ఇదే సమావేశంలో ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక సీనియర్ పేసర్ మహ్మద్ షమిని జట్టులోకి తీసుకునే అంశంపై సెలక్షన్ కమిటీ సీరియస్‌గా పరిగణించే వీలుంది. రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌లలో ఒకరిని తీసుకోవాలా? ఇద్దరినీ ఎంపిక చేయాలా? అంశంపై సెలక్టర్లు నిర్ణయం తీసుకోనున్నారు. ఆసియా కప్ జట్టులో ఉన్న అవేశ్ ఖాన్, అశ్విన్, బిష్ణోరులపై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. భారత్, ఆస్ట్రేలియా టీ20 సిరీస్ సెప్టెంబర్ 20న మొహాలీ మ్యాచ్‌తో ఆరంభం కానుంది. సిరీస్‌లో మూడో టీ20కి సెప్టెంబర్ 25న హైదరాబాద్ వేదిక కానున్న సంగతి తెలిసిందే.