Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భానుక అజేయ అర్థ సెంచరీ
- శ్రీలంక స్కోరు 170/6
దుబాయ్ : భానుక రాజపక్స (71 నాటౌట్, 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో చెలరేగాడు. 58/5తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న శ్రీలంకను భానుక రాజపక్స అసమాన ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. పాకిస్థాన్‌తో ఆసియా కప్ ఫైనల్లో ఆతిథ్య జట్టుకు భారీ స్కోరు అందించాడు. వానిందు హసరంగ డిసిల్వ (36, 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) సైతం మెరవటంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంకకు పాక్ పేసర్లు షాకిచ్చారు. వరుస వికెట్లతో లంకను ఇరకాటంలో పడేశారు. నిశాంక (8), కుశాల్ మెండిస్ (0), గుణతిలక (1), శనక (2) తేలిపోయారు. టాప్ ఆర్డర్లో ధనంజయ డిసిల్వ (29, 21 బంతుల్లో 4 ఫోర్లు) డ్రైవ్ షాట్లతో అలరించినా, వికెట్ నిలుపుకోలేదు. ఈ పరిస్థితుల్లో వానిందు జతగా భానుక రాజపక్స కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ ఇద్దరు క్రీజులో నిలువటంతో శ్రీలంక మెరుగైన స్కోరు దిశగా సాగింది. 35 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన రాజపక్స శ్రీలంకకు భారీ స్కోరు అందించాడు. చివర్లో కరుణరత్నె (14 నాటౌట్, 14 బంతుల్లో 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి రెండు బంతులను ఫోర్, సిక్సర్‌గా మలిచి జట్టు స్కోరు 170కి చేర్చాడు. పాక్ బౌలర్లలో హరీశ్ రవూఫ్ (3/29) రాణించాడు.