Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా పాఠశాల స్థాయి క్రికెట్‌ను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు, గ్రామీణ స్థాయిలో ప్రతిభావంతులైన క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ (ఐఎస్బీసీ) ఏర్పాటైంది. బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ వెంగ్ సర్కార్ ఈ స్కూల్ క్రికెట్ బోర్డుకు సలహాదారుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఐఎస్బీసీ వ్యవస్థాపక, సీఈవో కె.సునీల్ బాబు ప్రకటించారు. 'గవాస్కర్, సచిన్, కాంబ్లి, సూర్యకుమార్, యశస్వి సహా ఎంతో మంది క్రికెటర్లు పాఠశాల క్రికెట్ టోర్నీల ద్వారానే వెలుగులోకి వచ్చారు. ముంబయిలో స్కూల్ క్రికెట్ బలంగా ఉంది. అందుకే అక్కడి నుంచి ఎక్కువ మంది జాతీయ జట్టుకు ఎంపికవుతున్నారు. మిగతా రాష్ట్రాల్లోనూ స్కూల్ క్రికెట్‌ను ప్రోత్సహిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. ఐఎస్బీసీని ఏర్పాటు చేసిన సునీల్ బాబును అభినందిస్తున్నాను' అని దిలిప్ వెంగ్‌సర్కార్ అన్నారు.
చాంప్స్ నవీన్, సబీనా
జాతీయ టెన్‌పిన్ చాంపియన్‌షిప్స్
బెంగళూర్ : 31వ జాతీయ టెన్‌పిన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ఆటగాడు సిద్ధమ్ నవీన్ విజేతగా నిలిచాడు. మెన్స్ విభాగంలో నాల్గో సీడ్ నవీన్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అశోక్ కుమార్(కర్ణాటక)ను 483-457తో 26 పిన్ల తేడాతో ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. మహిళల విభాగంలో తమిళనాడు అథ్లెట్, రెండో సీడ్ సబీనా అథికా 273-261తో 12 పిన్ల తేడాతో జుడీ అల్బన్ (కర్ణాటక)పై గెలుపొంది విజేతగా నిలిచింది.