Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీసీసీఐలో మరో మూడేండ్ల పాటు జై షా, సౌరవ్ గంగూలీ పదవుల్లో కొనసాగే అవకాశం కనిపిస్తోంది. విరామ సమయం బీసీసీఐలోనే ఆరేండ్ల అనంతరం పరిగణించాలనే వాదనను అమీకస్క్యూరీ, సొలిసిటర్ జనరల్ వినిపించారు. దీంతో ధర్మాసనం ఈ నిబంధనa మార్పు చేసేందుకు మొగ్గుచూపవచ్చు!. గుజరాత్ క్రికెట్ సంఘంలో జై షా, బెంగాల్ క్రికెట్ సంఘంలో గంగూలీ పదవుల్లో కొనసాగుతూనే.. బీసీసీఐ ఎన్నికల్లో పోటీచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆరేండ్ల పదవీ కాలం ముగించుకున్న షా, గంగూలీ ద్వయం సుప్రీంకోర్టులో కేసు విచారణ సాకుతో పదవుల్లో కొనసాగుతున్నారు. రానున్న అక్టోబర్లో బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) నూతన పాలక వర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంది. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వస్తే.. గంగూలీ, జై షా మరోమారు ధనిక క్రికెట్ బోర్డు పగ్గాలు గుప్పిట్లో పెట్టుకోనున్నారు.
రాజ్యాంగ సవరణకు సుప్రీంకోర్టు అనుమతి లేకపోతే.. జస్టిస్ ఆర్ఎం. లోధా కమిటీ సిఫారసులను ఒక్కొక్కటిగా బోర్డు సవరించే ప్రమాదం ఉంది. అప్పుడు, లోధా కమిటీ సిఫారసులు, క్రికెట్ పాలనలో సంస్కరణలకు అర్థ లేకుండా పోతుంది. నేడు సుప్రీం తీర్పుతో మరింత స్పస్టత రానుంది.