Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాహౌర్: టి20 ప్రపంచకప్లో ఆడే పాకిస్తాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు(పిసిబి) గురువారం వెల్లడించింది. గాయం కారణంగా ఆసియాకప్ టోర్నీకి దూరంగా ఉన్న పేసర్ షాహిన్ షా అఫ్రిది జట్టులో చోటు దక్కించుకోగా.. ఫకర్ జమాన్ అనూహ్యంగా తుదిజట్టులో చోటు సంపాదించుకోలేకపోయాడు. పిసిబి ప్రకటించిన 15మంది జట్టుకు బాబర్ అజమ్ కెప్టెన్గా, షాదాబ్ ఖాన్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. ఎడమచేతి వాటం బ్యాటర్ మహ్మద్ మసూద్.. ఫకర్ జమాన్ స్థానంలో చోటు సంపాదించుకొన్నాడు. ఆసియాకప్ టోర్నీలో పాక్ జట్టు ఫైనల్లో ఓటమిపాలు కాగా.. సూపర్-12లో భాగంగా భారత్-పాక్ జట్లు అక్టోబర్ 23న టి20 ప్రపంచకప్లో తలపడనున్నాయి. మెగా టోర్నీకి ముందు పాక్ జట్టు ఇంగ్లండ్తో టి20 సిరీస్ ఆడనుంది.
జట్టు: బాబర్ అజమ్(కెప్టెన్), షాదాబ్ ఖాన్(వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ హస్నైన్, నవాజ్, రిజ్వాన్(వికెట్ కీపర్), వాసిం, నసీమ్ షా, షాహిన్ షా అఫ్రిది, షాన్ మసూద్, ఉమ్రన్ ఖాదిర్. స్టాండ్బై: ఫఖర్ జమాన్, మహ్మద్ హర్రీస్, షహనాజ్ దహానీ.
ఆఫ్ఘన్ జట్టు సారథిగా నబీ
టి20 ప్రపంచకప్లో ఆడే ఆఫ్ఘనిస్తాన్ జట్టు కెప్టెన్గా మహ్మద్ నబీ ఎంపికయ్యాడు. ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు టి20 ప్రపంచకప్లో తలపడే 17మందితో కూడిన జట్టును గురువారం ప్రకటించింది. ఆసియాకప్ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న జట్టునే టి20 ప్రపంచకప్కూ వెళ్లనుంది.
జట్టు: మహ్మద్ నబీ(కెప్టెన్), నజీబుల్లా జడ్రాన్(వైస్ కెప్టెన్), గుర్బాజ్(వికెట్ కీపర్), అజ్మతుల్లా, రసూలీ, ఫరీద్ అహ్మద్, ఫరూఖీ, జజారు, ఇబ్రహీం జడ్రాన్, ముజీబ్-ఉర్-రెహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఖయీస్ అహ్మద్, రషీద్ ఖాన్, సలీమ్ సఫీ, ఉస్మాన్ ఘనీ. స్టాండ్బై: అఫ్సర్ జజారు, అష్రాఫ్, రామత్ షా, గులాబుద్దిన్ నైబ్.