Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంజు శాంసన్‌కు కెప్టెన్సీ
- భారత్-ఏ వన్డే జట్టు ప్రకటన
- కివీస్-ఏతో వన్డే సిరీస్
ముంబయి : హైదరాబాదీ యువ కెరటం, వర్థమాన క్రికెటర్ తిలక్ వర్మ భారత్-ఏ వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుత న్యూజిలాండ్-ఏతో అనధికార టెస్టు సిరీస్‌లో అరంగ్రేటంలోనే శతకంతో చెలరేగిన తిలక్ వర్మ.. తాజాగా తొలిసారి భారత్-ఏ వన్డే జట్టులోకి వచ్చాడు. తిలక్ వర్మతో పాటు యువ ఆల్‌రౌండర్ రాజ్ బవా సైతం జట్టులో చోటు సాధించాడు. తిలక్ వర్మ, రాజ్ బవాలు అండర్-19 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు సాధించలేకపోయిన వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ భారత్-ఏ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. యువ బ్యాటర్ పృథ్వీ షా, ఉమ్రాన్ మాలిక్, నవదీప్ సైని, కుల్దీప్ యాదవ్ సహా తెలుగు తేజం కెఎస్ భరత్ సైతం జట్టులో నిలిచాడు. సెప్టెంబర్ 22న చెన్నైలో భారత్-ఏ, న్యూజిలాండ్-ఏ తొలి వన్డే జరుగనుంది. 25, 27న చెన్నైలోనే చివరి రెండు వన్డేలు సైతం ఆడనున్నారు.
భారత్-ఏ వన్డే జట్టు : సంజు శాంసన్ (కెప్టెన్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, రజత్ పటీదార్, కె.ఎస్ భరత్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, షాబాజ్ అహ్మద్, రాహుల్ చాహర్, తిలక్ వర్మ, కుల్దీప్ సేన్, శార్దుల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్, నవదీప్ సైని, రాజ్ అంగడ్ బవా.