Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయి హెడ్ కోచ్‌గా బౌచర్
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రెండు ప్రాంఛైజీలు జట్లకు కొత్త కోచ్‌లను ప్రకటించాయి. మూడేండ్ల పాటు పంజాబ్ కింగ్స్ చీఫ్ కోచ్‌గా కొనసాగిన అనిల్ కుంబ్లేకు ఈ ఏడాది కాంట్రాక్టు కొనసాగింపు లభించలేదు. వరుసగా గత మూడు సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు పంజాబ్ కింగ్స్ విఫలమైంది. దీంతో జట్టు యాజమాన్యం కొత్త కోచ్‌ను ఎంపిక చేసింది. ఇంగ్లాండ్‌కు ప్రపంచకప్ విజయాన్ని, కోల్‌కత నైట్‌రైడర్స్‌కు రెండు ఐపీఎల్ టైటిళ్లు సహా సిడ్నీ సిక్సర్‌కు బిగ్‌బాష్ లీగ్ ట్రోఫీని అందించిన ట్రెవర్ బేలిస్‌ను చీఫ్ కోచ్‌గా ప్రకటించింది. ఐపీఎల్లో గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సైతం పన చేసిన బేలిస్.. పెద్దగా ఆకట్టుకునే ఫలితాలు సాధించలేదు. ' పంజాబ్ కింగ్స్ కోచ్‌గా రావటం సంతోషం. సక్సెస్ దాహమే పంజాబ్ కింగ్స్‌కు ఫౌండేషన్. పంజాబ్ డ్రెస్సింగ్‌రూమ్ పంచుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని' అని ట్రెవర్ బేలిస్ అన్నారు.
ముంబయికి మార్క్ బౌచర్ : మరోవైపు ముంబయి ఇండియన్స్ తమ ప్రాంఛైజీ హెడ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, ఆ జట్టు చీఫ్ కోచ్ మార్క్ బౌచర్‌ను ఎంపిక చేసింది. ముంబయి ఇండియన్స్ చీఫ్ కోచ్‌గా కొనసాగిన మహేళ జయవర్ధనె ఇటీవల ముంబయి ఇండియన్స్ ప్రాంఛైజీ గ్లోబల్ క్రికెట్ చీఫ్‌గా పదోన్నత సాధించిన సంగతి తెలిసిందే. ఐదుసార్లు ఐపీఎల్ విజేత ముంబయి ఇండియన్స్‌కు రానున్న సీజన్లో మార్క్ బౌచర్ శిక్షణ సారథ్యం వహించనున్నాడు.