Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కివీస్-ఏ 237 ఆలౌట్
బెంగళూర్ : టీమ్ ఇండియా యువ బౌలర్లు రాణించారు. బెంగళూర్‌లో జరుగుతున్న మూడో అనధికార టెస్టులో న్యూజిలాండ్-ఏను తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకే కుప్పకూల్చారు. సౌరభ్ కుమార్ (4/48), రాహుల్ చాహర్ (3/53), ముకేశ్ కుమార్ (2/48) విజృంభించటంతో భారత్-ఏ తొలి ఇన్నింగ్స్‌లో విలువైన ఆధిక్యం సంపాదించింది. రెండో రోజు ఆటలో మార్క్ చాప్మాన్ (92, 115 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), సీన్ సోలియ (54, 111 బంతుల్లో 7 ఫోర్లు) రాణించినా.. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. భారత్-ఏ రెండో ఇన్నింగ్స్‌లో 40/1తో కొనసాగుతోంది. ప్రియాంక్ పంచల్ (17 బ్యాటింగ్), రుతురాజ్ గైక్వాడ్ (18 బ్యాటింగ్) అజేయంగా క్రీజులో నిలిచారు. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (4) వికెట్ కోల్పోయాడు. రుతురాజ్ గైక్వాడ్ (108, 127 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకానికి తోడు ఉపేంద్ర యాదవ్ (76, 134 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) కదం తొక్కటంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్-ఏ 293 పరుగులు సాధించింది. ప్రస్తుతం భారత్-ఏ 96 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.