Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో టీ20లో భారత్ ఓటమి
బ్రిస్టోల్ : స్మృతీ మంధాన మెరుపులతో టీ20 సిరీస్‌ను నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌కు తీసుకెళ్లిన టీమ్ ఇండియా.. సిరీస్ ఫైట్‌లో తేలిపోయింది. చివరి టీ20లో ఇంగ్లాండ్ మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2-1తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులే చేసింది. స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 18.2 ఓవర్లలోనే ఛేదించింది. సోఫీ ఎకెల్‌స్టోన్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలువగా, సోఫీ డంక్లీ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకుంది. భారత్, ఇంగ్లాండ్ మహిళల తొలి వన్డే ఆదివారం జరుగనుంది. టాప్ ఆర్డర్ వైఫల్యంతో భారత్ పరుగుల వేటలో వెనుకబడింది. షెఫాలీ వర్మ (5), స్మృతీ మంధాన (9), సబ్బినేని మేఘన (0), హర్మన్‌ప్రీత్ కౌర్ (5), హేమలత (0), స్నేహ్ రానా (8) పేలవ ప్రదర్శన చేశారు. దీప్త శర్మ (24), రిచా ఘోష్ (33), పూజ వస్ట్రాకర్ (19) రెండెంకల ఇన్నింగ్స్‌లతో భారత్‌కు గౌరవప్రద స్కోరు అందించారు. ఇంగ్లాండ్ బౌలర్లు సోఫీ ఎకెలస్టోన్ (3/25), సారా గ్లెన్ (2/11) భారత్‌ను కట్టడి చేశారు. ఇక ఛేదనలో ఇంగ్లాండ్ టాప్-3 రెచ్చిపోయారు. సోఫీ డంక్లీ (49, 44 బంతుల్లో 6 ఫోర్లు), డానీ వ్యాట్ (22, 23 బంతుల్లో 1 ఫోర్), అలీస్ కాప్సీ (38 నాటౌట్, 24 బంతుల్లో 6 ఫోర్లు) అదరగొట్టారు. ఈ ముగ్గురు మెరవటంతో మరో 10 బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ లాంఛనం ముగించింది.