Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్ఏసీ అధ్యక్షుడితో క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ : అక్టోబర్ 25న ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ నిర్వహణకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని, హైదరాబాద్కు వన్నె తీసుకొచ్చే రీతిలో మ్యాచ్ నిర్వహించాలని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సుదీర్ఘ విరామం అనంతరం ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ ఆదివారం మంత్రిని ఆయన కార్యాలయంలో కలిశారు. మ్యాచ్కు ముందస్తు ఏర్పాట్లు, నిర్వహణపై చర్చించారు. మ్యాచ్ నిర్వహణకు అజహరుద్దీన్ ప్రభుత్వ సహకారం కోరారు. ప్రభుత్వ తరఫున సహాయానికి హామీ ఇచ్చిన మంత్రి, పోలీసు శాఖకు సంబంధించిన అంశాలపై డీజీపీ మహేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. బల్దియా, విద్యుత్, అగ్ని మాపక, వైద్య విభాగాలు మ్యాచ్కు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. ఇదిలా ఉండగా, మూడేండ్ల తర్వాత హైదరాబాద్లో జరుగుతున్న మ్యాచ్ పట్ల అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. మ్యాచ్ టికెట్లను సెప్టెంబర్ 15న ఆన్లైన్లో ఉంచిన క్షణాల్లోనే మాయమయ్యాయి!. టికెట్ల అందుబాటుపై క్రికెట్ అభిమానులు హెచ్ఏసీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.