Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాన కార్యదర్శి నియామకంపై చర్చకు పట్టు
కోల్‌కత : భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు కళ్యాణ్ చౌబే ఆల్ ఇండియా పుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రోజుల వ్యవధిలోనే వివాదాలకు బీజం పడింది. ఎన్నికల్లో దన్నుగా నిలిచిన వ్యక్తికి, ఎలక్టోరల్ కాలేజీలో సభ్యుడికి వేతనంతో కూడిన పదవికి కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. కోల్‌కతలో సోమవారం ఏఐఎఫ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరుగగా, భారత మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా ఈ అంశాన్ని లేవనెత్తారు. సమావేశంలో చర్చకు పెట్టాలని డిమాండ్ చేసినా, పట్టించుకోలేదు. ' ఏఐఎఫ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి హాజరయ్యాను. ప్రధాన కార్యదర్శిగా షాజి ప్రభాకరన్ నియామకంపై చర్చకు కోరాను. నా అభ్యర్థను తిరస్కరించారు. సమావేశానికి మూడు రోజుల ముందే చర్చకు అవకాశం ఇవ్వాలని కోరాను. అయినా, పట్టించుకోలేదు. ప్రభాకరన్ ఢిల్లీ ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షుడు. ఎన్నికల్లో కళ్యాణ్‌కు ఎన్నికల ఏజెంట్‌గా పని చేశారు. ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన వారికి ఇలా వేతనంతో కూడిన పదవులు ఇస్తామనే బేరసారాలకు తెరదీసే సంప్రదాయం మంచిది కాదు. న్యాయపరంగా ముందుకెళ్లే అంశంపైనా పరిశీస్తున్నానని భూటియా తెలిపాడు.
స్టాండ్బైలూ ఆసీస్‌కు!
ముంబయి : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత్ జంబో బృందాన్ని పంపించనుంది. అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టును ఇప్పటికే బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. స్టాండ్‌బై ఆటగాళ్లుగా నలుగురు క్రికెటర్లను ఎంపిక చేసింది. దక్షిణాఫ్రికాతో చివరి టీ20 అక్టోబర్ 4న ముగియనుండగా.. అక్టోబర్ 6న చెన్నై నుంచి ఆస్ట్రేలియాకు బయల్దేరనున్నారు. రెగ్యులర్ ఆటగాళ్లతో పాటు స్టాండ్‌బై ఆటగాళ్లను సైతం ఆసీస్ తీసుకెళ్లేందుకు బోర్డు నిర్ణయించింది. ప్రపంచకప్ సమయంలో జట్టుకు రిజర్వ్ ఆటగాడి అవసరం ఏర్పడితే.. తక్షణమే అందుబాటులో ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. పేసర్లు మహ్మద్ షమి, దీపక్ చాహర్, రవి బిష్ణోరు సహా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ టీ20 ప్రపంచకప్ స్టాండ్‌బై ఆటగాళ్లుగా ఎంపికైన సంగతి తెలిసిందే.