Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్ట్రయిక్‌రేట్‌పై దృష్టి పెట్టాను : రాహుల్
మొహాలి : పేలవ ఫామ్, స్ట్రయిక్‌రేట్‌పై వస్తోన్న విమర్శలను భారత వైస్‌కెప్టెన్ కెఎల్ రాహుల్ తిప్పికొట్టాడు. ఓ ఆటగాడికి డ్రెస్సింగ్‌రూమ్‌లో కెప్టెన్, కోచ్, సహచర ప్లేయర్లు తన గురించి చేస్తోన్న ఆలోచనలు ప్రధానం కానీ బయటి వ్యక్తుల విమర్శలు కావని రాహుల్ స్పందించాడు. 'చూడండి, ఎవరూ పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశంలో మెరుగుదల కోసం ప్రయత్నిస్తారు. అందరికీ పోషించాల్సిన పాత్ర ఉంటుంది. ఓ ఆటగాడు ఓ స్ట్రయిక్‌రేట్‌లో ఎందుకు ఆడాడనే కోణంలో ఎప్పటికీ చూడలేరు. 200 స్ట్రయిక్‌రేట్‌తో ఆడటం వ్యక్తిగత ప్రయోజనమా? 100-120 స్ట్రయిక్రేట్తోనే జట్టుకు విజయాలను అందించగల్గు తున్నామా? అనే అంశాలు అందరూ విశ్లేషించేవి కాదు. మీరు గణాంకాలే చూస్తే.. నెమ్మదిగా ఆడినట్టే కనిపిస్తాయి' అని కెఎల్ రాహుల్ వ్యాఖ్యానించారు. 'అవును, స్ట్రయిక్‌రేట్ మెరుగుదల కోసం శ్రమిస్తున్నాను. గత 10-12 నెలల్లో ప్రతి ఆటగాడు పోషించాల్సిన పాత్రపై సమగ్రమైన నిర్వచనం ఇచ్చారు. ఆటగాడి నుంచి జట్టు ఏం ఆశిస్తుందో అర్థం చేసుకున్నాం. ఆటగాళ్లు ఆ దిశగా మెరుగయ్యేందుకు పనిచేస్తున్నారు. నేను కూడా, ఓపెనర్‌గా మెరుగైన ప్రదర్శనలు చేసేందుకు వర్క్ చేస్తున్నాను' అని రాహుల్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో తొలి టీ20కి ముందు మీడియా కాన్ఫరెన్స్‌కు వచ్చిన కెఎల్ రాహుల్‌ను విమర్శలపై ఓ విలేకరి అడుగగా..' ప్రతిసారి ఏదో ఒక అంశంపై విమర్శలు వస్తూనే ఉంటాయి. కానీ ఆటగాడికి అత్యంత ముఖ్యమైన విషయం డ్రెస్సింగ్‌రూమ్‌లో కెప్టెన్, కోచ్, సహచర ఆటగాళ్లు తన గురించి చేసే ఆలోచనలు మాత్రమే' అని రాహుల్ బదులిచ్చాడు.