Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ సొంతం
దుబాయ్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్, మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ సాధించింది. ఇంగ్లాండ్‌పై తొలి వన్డేలో 91 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగిన మంధాన.. ఈ ఫార్మాట్లో భారత్ తరఫున మెరుగైన ర్యాంకర్‌గా నిలిచింది. వన్డే బ్యాటర్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచిన స్మృతీ మంధాన.. పొట్టి ఫార్మాట్లో వరల్డ్ నం.2 స్థానానికి ఎగబాకింది. ఇంగ్లాండ్‌పై మూడు టీ20ల్లో 111 పరుగులు సాధించిన మంధాన నం.2 స్థానానికి చేరుకుంది. జట్టు ర్యాంకింగ్స్‌లో భారత్ ఇటు వన్డేలు, ఇటు టీ20ల్లో నాల్గో స్థానానికి పరిమితమైంది.
గచ్చిబౌలి షూటింగ్ రేంజ్లో జరిగిన సౌత్ జోన్ షాట్‌గన్ చాంపియన్‌షిప్స్‌లో దక్షిణాది ఏడు రాష్ట్రాల నుంచి 250 మంది షూటర్లు పోటీపడ్డారు. విభాగాల వారీగా విజేతలకు తెలంగాణ రైఫిల్ సంఘం అధ్యక్షుడు అమిత్ సంఘీ బహుమతులు అందజేశారు.
23న మళ్లీ టికెట్లు! : ఈ ఆదివారం (అక్టోబర్ 25) ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్లను సామాన్యులకు సైతం అందుబాటులో హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్‌ను డివైఎఫ్ఐ నాయకులు కోరారు. అక్టోబర్ 23న (శుక్రవారం) టికెట్లను మరోసారి అభిమానులకు అందుబాటులో ఉంచుతామని ఈ సందర్భంగా అజహరుద్దీన్ హామీ ఇచ్చినట్టు డివైఎఫ్ఐ నాయకులు వెంకటేశం, జావెద్ తెలిపారు.