Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: హాకీ ఇండియా(హెచ్ఐ) నూతన అధ్యక్షునిగా దిలిప్ టిర్కె ఎన్నికయ్యాడు. భారత హాకీజట్టు మాజీ కెప్టెన్ అయిన టిర్కె శుక్రవారం ఏకగ్రీవంగా ఆ పదవికి ఎన్నికయ్యాడు. అక్టోబర్ 1న హాకీ ఇండియా ఎన్నికలు జరగాల్సి ఉండగా.. అధ్యక్ష పదవికి టిర్కె మినహా.. మరెవ్వరూ పోటీదారులు లేకపోవడంతో ముందుగానే ఫలితాన్ని ప్రకటించారు. అధ్యక్ష పదవికి రేసులో ఉన్న ఉత్తరప్రదేశ్ హాకీ చీఫ్ రాకేశ్ కత్యాల్ రాష్ట్రపతి పదవికి పోటీ చేయడంతో, జార్ఖండ్‌కు చెందిన భోలానాథ్ సింగ్‌లు తమ తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో టిర్కె ఒక్కరే ఆ పదవి రేసులో ఉండడంతో అతని ఎన్నిక లాంఛనమైంది. ఇక సెక్రటరీ జనరల్‌గా భోలానాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.