Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భారత్-ఆస్ట్రేలియా మూడో టి20 మ్యాచ్‌కు సంబంధించి గురువారం సికింద్రాబాద్ జింఖానా మైదానంలో టికెట్ల అమ్మకం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన నేపథ్యంలో ... శుక్రవారం జింఖానా మైదానపు ప్రవేశ ద్వారాన్ని పోలీసులు మూసేశారు. టికెట్లు అమ్మడం లేదని.. దయచేసి సహకరించాలని ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. మైదానానికి చేరుకుంటున్న ఫ్యాన్స్‌ను వెనక్కు పంపేస్తున్నారు. ఈ నెల 25వ తేదీన ఉప్పల్ స్టేడియంలో భారత్- ఆసీస్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో... టికెట్ల అమ్మకాల కోసం హైదరా బాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఏర్పాట్లు చేసింది. సికింద్రా బాద్‌లోని జింఖానా మైదానంలో టికెట్లు అమ్ముతుండటంతో మ్యాచ్ టికెట్ల కోసం గురువారం ఉదయం నుంచే అభిమానులు పెద్ద ఎత్తున బారులు తీరారు. టికెట్ల కొనుక్కునేందుకు ప్యారడైజ్ సర్కిల్ నుంచి జింఖానా వరకు క్యూలైన్ ఏర్పాటు చేశారు.
అంచనాలకు మించి వేలాదిగా క్రికెట్ అభిమానులు రావడంతో వాళ్లను నియంత్రించేందుకు పోలీసులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఉదయం నుంచే టికెట్స్ అమ్ముతున్నప్పటికీ.. బాగా ఆలస్యం జరు గుతుండటంతో అభిమానలు ఆగ్రహంతో రగిలిపోయారు.