Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'టికెట్ల విక్రయాల్లో హెచ్‌సీఏ నుంచి ఎలాంటి పొరపాట్లు జరగలేదు. చాలా ఏండ్లకు హైదరాబాద్‌లో అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించే అవకాశం దక్కింది. ప్రతి ఒక్కరూ మ్యాచ్‌ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. మ్యాచ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లుచేశాం. ఆసీస్‌తో మ్యాచ్ ఆసక్తికరంగా జరుగుతుందని భావిస్తున్నాం. పేటీఎం ద్వారా టికెట్లు విక్రయించాం. బ్లాక్‌లో టికెట్లు అమ్మేవారిపై కఠినంగా వ్యవహరిస్తాం. బ్లాక్‌లో టిక్కెట్లు అమ్మతున్నారనే వదంతులు ఎలా వచ్చాయో తెలియదు. టికెట్ల విక్రయంపై దుష్ప్రచారం జరుగుతున్నది.
- అవన్నీ ఆరోపణలే
- టికెట్ల అమ్మకాన్ని పేటీఎంకు అప్పగించాం : అజారుద్దీన్
- బ్లాక్‌లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాఖ్య
హైదరాబాద్: బ్లాక్‌లో టికెట్లు అమ్మారనే ప్రచారం అవాస్తవం. టికెట్ల విక్రయంలో హెచ్‌సీఏ ఎలాంటి తప్పూ చేయలేదు. ఆన్లైన్లో టికెట్లు అమ్మితే బ్లాక్‌లో ఎలాసాధ్యం? జింఖానా మైదానంలో జరిగిన ఘటనకు చాలా బాధపడుతున్నాం. క్షతగాత్రులకు హెచ్‌సీఏ తరఫున చికిత్స అందిస్తాం' అని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ అన్నారు. భారత్-ఆసీస్ మ్యాచ్ టికెట్ల అమ్మకానికి, హెచ్‌సీఏకు సంబంధంలేదని తెలిపారు. టికెట్ల విక్రయం బాధ్యతను పేటీఎంకు అప్పగించినట్టు తెలిపారు. టికెట్ల విక్రయంలో పేటీఎం అద్భుతంగా పనిచేసిందని ప్రశంసించారు. టికెట్లు ఆన్లైన్లోనే అమ్మామనీ.. బ్లాక్‌లో అమ్మలేదని చెప్పారు. హెచ్‌సీఏ టికెట్ల విక్రయంపై వస్తున్న వార్తాలన్నీ ఆరోపణలేనన్నారు. బ్లాక్‌లో అమ్మినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. స్టేడియంలో మ్యాచ్ ఏర్పాట్లలో తామంతా బిజీగా ఉన్నట్టు చెప్పారు. మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్లతో పాటు ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా టికెట్ల విక్రయ వివరాలను హెచ్‌సీఏ కార్యదర్శి విజయానంద్‌తో కలిసి మీడియాకు వెల్లడించారు.
అజహరుద్దీన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి : హెచ్ఆర్సీకి బీసీ రాజకీయ ఐకాస ఛైర్మన్ ఫిర్యాదు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జింఖానా మైదానంలో గురువారం జరిగిన మ్యాచ్ టికెట్ల విక్రయంలో నిర్లక్ష్యం, అవినీతికి పాల్పడ్డారని.. వెంటనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజహరుద్దీన్‌పై క్రిమినల్ కేసు నమోదుచేసి పదవి నుంచి తొలగించాలని బీసీ రాజకీయ ఐకాస ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(ఎస్హెచ్ఆర్సీ)కి ఫిర్యాదుచేశారు. క్రీడాభిమానులపై లాఠీఛార్జికి కారకుడైన అజహరుద్దీన్‌తో పాటు హెచ్‌సీఏ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'జింఖానా మైదానం వద్ద తొక్కిసలాటకు హెచ్‌సీఏతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణం. ఉప్పల్‌లో ఈనెల 25న జరగబోయే భారత్, ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్ ఏర్పాట్ల విషయంలో హెచ్‌సీఏ పూర్తి వైఫల్యం చెందింది. క్రీడాభిమానుల నుంచి రూ. కోట్లు దండుకొని టికెట్ల విషయంలో సరైన ఏర్పాట్లు చేయలేదు. టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న వారికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి' అని ఆయన డిమాండ్ చేశారు.