Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్: భారత యువ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగైసి.. జులియస్ బేర్ జనరేషన్ కప్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. రౌండ్ రాబిన్ నాకౌట్ విధానంలో జరుగుతున్న ఈ టోర్నీ సెమీఫైనల్లో శనివారం అర్జున్.. లియామ్ క్వాంగ్ లీ (వియత్నాం)పై విజయం సాధించాడు. తొలి గేమ్ 'డ్రా' చేసుకున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్.. రెండో గేమ్‌లో గెలుపొందాడు. మూడో గేమ్ 'డ్రా' కాగా.. నాలుగో గేమ్‌లో ప్రత్యర్థి నెగ్గాడు. దీంతో విజేతను తేల్చేందుకు టై బ్రేకర్ నిర్వహించగా.. 19 ఏండ్ల అర్జున్ సత్తాచాటాడు. ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, వరల్డ్ చాంపియన్ మాగస్ కార్లసన్‌తో అర్జున్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.