Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాన్ స్ట్రయికర్లకు సూచన
లార్డ్స్ : భారత మహిళల క్రికెట్లో ఓ శకం ముగిసింది. దిగ్గజ పేసర్, జెంటిల్వుమెన్ జులన్ గోస్వామి వీడ్కోలు సిరీస్.. అనూహ్యంగా ఇతర కారణాలతో హైలైట్‌గా నిలిచింది. ఇంగ్లాండ్ మహిళలతో మూడో వన్డేలో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ రెండు ఇన్నింగ్స్‌లో కదం తొక్కింది. తొలుత బ్యాట్‌తో అర్థ సెంచరీ బాది కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకోగా.. బంతితో మరో విధంగా మెరిసింది. ఇంగ్లాండ్ చివరి వికెట్ భాగస్వామ్యం భారత్‌ను బాగా ఇబ్బంది పెట్టింది. చార్లీ డీన్ బంతి వేయడానికి ముందే క్రీజు వదిలి వెళ్లటాన్ని గమనించిన దీప్తి శర్మ ఆమెను నాన్ స్ట్రయిక్ ఎండ్‌లో రనౌట్ చేసింది. చార్లీ డీన్ వికెట్‌తో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ పతనమైంది. భారత్ విజయం సాధించింది. వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే, ప్రతికూల పరిస్థితుల్లో అసమాన ప్రదర్శన చేసిన చార్లీ డీన్ ఈ విధంగా రనౌట్ కావటంతో నిర్ఘాంతపోయింది. భావోద్వేగంతో కంటతడి పెట్టినా.. వెంటనే భారత క్రికెటర్లతో కరచాలనం చేసింది. ఇక, దీప్తి శర్మ ఇలా రనౌట్ చేయటంపై ఇంగ్లాండ్ మీడియా నెగెటివ్‌గా చూపించింది. జులన్ గోస్వామి వీడ్కోలు సిరీస్‌లో ఫోకస్‌ను ఆ రనౌట్పైకి షిఫ్ట్ చేసింది!. మాజీ క్రికెటర్లు, సోషల్ మీడియా, అభిమానులు ఈ రనౌట్‌పై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే, ప్రపంచ క్రికెట్ రూల్స్ రూపకర్త, మెర్లీబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఈ అంశంలో భారత క్రీడాకారిణి దీప్తి శర్మకు మద్దతుగా నిలిచింది. 'ఎంసీసీ, ఐసీసీ నూతన నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. నాన్‌స్ట్రయిక్ ఎండ్‌లో రనౌట్‌ను అన్‌ఫెయిర్ ప్లే విభాగం నుంచి తొలగించి, రనౌట్ జాబితాలోకి చేర్చారు. బౌలర్ బంతిని వదిలే వరకు నాన్ స్ట్రయికర్ క్రీజు వదలి రాకుండా ఉండటం మంచిది' అని ఎంసీసీ స్పష్టం చేసింది.