Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెరిసిన తిలక్, శాంసన్, భవా
- కివీస్-ఏపై 3-0తో సిరీస్ వశం
చెన్నై : ఓ వైపు సీనియర్ జట్టు బౌలర్లు నిలకడగా అంచనాలను అందుకోవటంలో విఫలం అవుతుంటే.. మరో వైపు యువ జట్టు బౌలర్లు అదరగొడుతున్నారు. ముచ్చటగా మూడో అనధికార వన్డేలో న్యూజిలాండ్-ఏను చిత్తు చేశారు. హ్యాట్రిక్ విజయాలతో అనధికార వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఏ జట్టు 49.3 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ సంజు శాంసన్ (54, 68 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ (50, 62 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు)లకు తోడు శార్దుల్ ఠాకూర్ (51, 33 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ అర్థ సెంచరీతో కదం తొక్కాడు. అభిమన్యు ఈశ్వరన్ (39,35 బంతుల్లో 8 ఫోర్లు), రిషీ ధావన్ (34, 46 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. ఛేదనలో న్యూజిలాండ్-ఏ చేతులెత్తేసింది. భారత-ఏ బౌలర్ల ధాటికి 38.3 ఓవర్లలో 178 పరుగులకే కుప్పకూలింది. యువ బౌలర్ రాజ్ భవ (4/11) సంచలన ప్రదర్శన చేశాడు. రాహుల్ చాహర్, కుల్దీప్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. కివీస్-ఏ ఓపెనర్ డేన్ క్లీవర్ (83, 89 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేసినా.. జట్టుకు వైట్‌వాష్ ఓటమిని తప్పించలేకపోయాడు.