Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బౌలర్ల వైఫల్యంపై విక్రమ్ రాథోర్
తిరువనంతపురం : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు సన్నద్ధమవుతున్న టీమ్ ఇండియా.. లక్ష్యాలను కాపాడుకోవటంలో బౌలర్ల వైఫల్యంపై వాస్తవిక స్వీయ సమీక్షకు డ్రెస్సింగ్‌రూమ్ సిద్ధమైంది. కానీ, భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ అందుకు పూర్తి విరుద్ధమైన ప్రకటన చేశాడు.ఆసియాకప్‌లో మంచు ప్రభావం లేకపోయినా, భారత బౌలర్లు తేలిపోయారు. ఆస్ట్రేలియాతో మొహాలితో టీ20లోనే కాస్త మంచు ప్రభావం కనిపించింది. అయినా, బౌలర్ల వైఫల్యాలను మంచుపై నెట్టేయటం ఆశ్చర్యానికి లోనుచేస్తుంది.ఆసియా కప్ సూపర్ నుంచి భారత్ ఆరు మ్యాచుల్లో పోటీపడింది. మూడింట విజయాలు, మూడు పరాజయాలు చవిచూసింది. ఓడిన మూడు మ్యాచుల్లోనూ భారత్ లక్ష్యాలను కాపాడుకోలేదు. దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి ముందు, ప్రాక్టీస్ సెషన్ అనంతరం బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ' లక్ష్యాలను కాపాడుకునేప్పుడు ఆ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాం. నిజం చెప్పాలంటే, బౌలర్ల ప్రదర్శనపై టాస్ కీలక పాత్ర పోషిస్తుంది. మేము లక్ష్యాలను కాపాడుకోలేని ప్రతిసారి మంచు ప్రభావం ఎక్కువగా ఉంది, ఛేదనలో ప్రత్యర్థికి అనుకూలించింది. బౌలర్లపై మరీ ఎక్కువగా విమర్శలు చేయలేం. టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో ప్రతిసారి చివరి ఓవర్ వరకు బౌలర్లు తీసుకెళ్లారు' అని విక్రమ్ రాథోర్ అన్నారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు బ్యాటర్లు వేగంగా పరుగులు చేయటం లేదనే విమర్శను సైతం విక్రమ్ రాథోర్ తోసిపుచ్చారు. 'చివరి టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఆ సమస్య ఎదుర్కొంటుంది. కానీ ఆ తర్వాత ఆ పరిస్థితి లేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రతిసారి మంచి స్కోర్లే సాధించింది. కొన్నిసార్లు పిచ్ స్వభావంపైనా ఇది ఆధారపడి ఉంటుంది. తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు, భారీ స్కోర్లు పెద్ద విషయమని నేను అనుకోవటం లేదు' అని విక్రమ్ రాథోర్ వ్యాఖ్యానించాడు.