Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెస్టాఫ్ ఇండియా జట్టు ప్రకటన
ముంబయి : ప్రతిష్టాత్మక ఇరానీ కప్‌కు రెస్టాఫ్ ఇండియా జట్టును బుధవారం ప్రకటించారు. ఈ మేరకు 16 మందితో కూడిన జట్టును బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. భారత టెస్టు జట్టులో కీలక ఆటగాడు, తెలుగు తేజం హనుమ విహారికి తొలిసారి సారథ్య పగ్గాలు అప్పగించింది. అక్టోబర్ 1-5న రాజ్‌కోట్ వేదికగా 2019-20 రంజీ ట్రోఫీ చాంపియన్ సౌరాష్ట్రతో రెస్టాఫ్ ఇండియా పోటీపడనుంది. భారత జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సైతం జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇటీవల న్యూజిలాండ్-ఏపై మాయజాలం ప్రదర్శించిన లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్‌ను సైతం జట్టులోకి తీసుకున్నారు. న్యూజిలాండ్-ఏపై అరంగేట్రంలోనే శతకం బాదిన హైదరాబాదీ యువ కెరటం తిలక్ వర్మను సెలక్టర్లు పక్కనపెట్టారు!. మరో తెలుగు తేజం కెఎస్ భరత్ వికెట్ కీపర్‌గా జట్టులో నిలిచాడు.
రెస్టాఫ్ ఇండియా : హనుమ విహారి (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, అభిమన్యు ఈశ్వరన్, యశ్ ధుల్, సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్, కె.ఎస్ భరత్, ఉపేంద్ర యాదవ్, జయంత్ యాదవ్, సౌరభ్ కుమార్, ఆర్. సాయికిశోర్, ముకేశ్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్, అర్జాన్ నాగ్వాస్వల్లా.