Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్టోబర్ 20న ఎన్నికలు
ముంబయి : భారత క్రికెట్ సర్క్యూట్లో పరిపాలన విభాగంలోకి మరో మాజీ క్రికెటర్ అడుగుపెడుతున్నాడు. ముంబయి క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధ్యక్ష పదవి కోసం మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ పోటీ చేయనున్నట్టు సమాచారం. ఎలక్షన్ ఆఫీసర్ జెఎస్ సహారియ ఐదుగురు ఆఫీస్ బేరర్లు, తొమ్మిది మంది అపెక్స్ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల చేశారు. బీసీసీఐ ఎన్నికలు అక్టోబర్ 18న ముగియనుండగా.. రెండు రోజుల అనంతరం అక్టోబర్ 20న ఎంసీఏ నూతన ఆఫీస్ బేరర్లను ఎన్నుకోనుంది. ఐసీసీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ మద్దతు సందీప్ పాటిల్‌కు ఉండటంతో అధ్యక్షుడిగా ఎన్నిక లాంఛనమే అని తెలుస్తోంది. ఈ వర్గం నుంచి కార్యదర్శి రేసులో అజింక్య నాయక్ నిలువనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఎంసీఏ పగ్గాలు చేపట్టిన ఆశీష్ షేహ్లా వర్గం బీసీసీఐలో కీలక పదవి ఆశిస్తోంది. ఎంసీఏ ఎన్నికల్లో ఆ వర్గం నుంచి ఎవరు నిలబడతారనేది ఇంకా తెలియాల్సి ఉంది. అక్టోబర్ 3న ప్రస్తుతం ఆఫీస్ బేరర్ల పదవీ కాలం ముగిసింది. సెప్టెంబర్ 28న ఎన్నికల నిర్వహణకు సిద్ధమైనా.. సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చింది.