Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవిష్కరించిన సౌరవ్ గంగూలీ
కోల్‌కత : ప్రపంచ క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ మైదానం. భారత జట్టు ఆధునిక క్రికెట్ పుట్టినిల్లుగా సైతం లార్డ్స్‌ను పేర్కొంటారు. అందుకు ఓ కారణం ఉంది. విదేశీ పర్యటనల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాను ఎదుర్కొవటంలో భారత్ మానసికంగా కాస్త వెనుకంజలో కనిపించేది. ఇంగ్లీశ్ క్రికెట్ ఆధిపత్యానికి చెరమగీతం పాడుతూ, వారి గడ్డపై నాట్‌వెస్ట్ సిరీస్ విజయాన్ని అందుకున్న సౌరవ్ గంగూలీ.. లార్డ్స్ మైదానం బాల్కనీలో చొక్కా విప్పి సంబురాలు చేసుకున్నాడు. భారత జట్టులో దూకుడు మంత్రం అక్కడి నుంచి మొదలైందని క్రికెట్ పండితులు చెబుతారు. ఇక సౌరవ్ గంగూలీ టెస్టు క్రికెట్ కెరీర్ సైతం లార్డ్స్‌లోనే ఆరంభమైంది. అరంగేట్ర టెస్టులోనే శతకం బాదిన దాదా.. లార్డ్స్ మైదానాన్ని మరింత ప్రత్యేకం చేసుకున్నాడు. తాజాగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఓ పూజ మందిరంలో లార్డ్స్ బాల్కనీ ఏర్పాటు చేశారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ బాల్కనీని ఆవిష్కరించాడు. అయితే, ఈ సారి చొక్కా స్థానంలో జాతీయ జెండాను పట్టుకున్న గంగూలీ భక్తులు, అభిమానుల సమక్షంలో బాల్కనీలో సందడి చేశాడు. దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఏడాది ఇక్కడ ప్రఖ్యాత కట్టడాలను ఏర్పాటు చేయటం సంప్రదాయంగా వస్తోంది. ఈ ఏడాది లార్డ్స్ బాల్కనీని ఏర్పాటు చేశారు. లార్డ్స్ బాల్కనీ చూసేందుకు ప్రజలు విశేషంగా వస్తున్నారు.