Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్లో ఎస్‌కేవీబీఆర్ బొటానికల్ వాకర్స్ అసోసియేషన్ 'రన్ ఫర్ పీస్' సెకెండ్ ఎడిషన్‌ను నిర్వహించనుంది. గురువారం అరణ్యభవన్‌లో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర అటవీ అభివద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి 'రన్ ఫర్ పీస్ జెర్సీ, మెడల్స్, బ్రౌచర్ ఆవిష్కరించారు. 'ఈ ఏడాది రన్లో పాల్గొనడానికి రెండు వేల మంది పేర్లను నమోదు చేసుకున్నారు. 10కే, 5కే, 3కే విభాగాల్లో రన్‌ను నిర్వహిస్తున్నాం. ఉదయం 6 గంటలకు 10కే రన్‌ను ప్రారంభిస్తాం. టైటిల్ స్పాన్సర్‌గా ఎన్ఎన్ఆర్ డ్రీమ్ స్కేప్ సంస్థ వ్యవహరిస్తోంది. డా. తేజశ్వినీ మనోజ్ఞ ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమం సైతం ఏర్పాటు చేశామని' వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చల్లా భరత్‌కుమార్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సెక్రటరీ పి.బాల కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.