Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : సూర్యకుమార్ యాదవ్ టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నాడు. ఓ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా సూర్య నిలిచాడు. 2018లో శిఖర్ ధావన్ (689) రికార్డును సూర్య (732) అధిగమించాడు. పొట్టి ఫార్మాట్లో వెయ్యి పరుగులకు 24 పరుగుల దూరంలో నిలిచిన సూర్య కుమార్.. దక్షిణాఫ్రికాపై సూపర్ అర్థ సెంచరీతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నం.2 స్థానానికి ఎగబాకాడు. ఈ ఏడాది సూర్య స్ట్రయిక్‌రేట్ 180.22 కాగా, ఇప్పటికే అతడు 57 సిక్సర్లు, 88 ఫోర్లతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. 32 ఏండ్ల సూర్య 30 ఇన్నింగ్స్‌ల్లో 39.04 సగటుతో 976 పరుగులు చేయగా.. అందులో 732 పరుగులు ఈ ఏడాది సాధించినవే కావటం విశేషం. సూర్య ఖాతాలో ఓ శతకం, ఎనిమిది అర్థ సెంచరీలు సైతం ఉన్నాయి.