Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20 ప్రపంచకప్ ప్రైజ్‌మనీ
దుబాయ్ : పొట్టి ప్రపంచకప్ చాంపియన్ రూ. 13 కోట్లు ఖాతాలో వేసుకుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2022 మెన్స్ టీ20 ప్రపంచకప్ ప్రైజ్‌మనీ వివరాలు శుక్రవారం వెల్లడించింది. 2021 ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్‌కు అందించిన నగదు బహుమతినే 2022 టీ20 వరల్డ్‌కప్‌కు సైతం కొనసాగించింది. అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా ఆరంభం కానున్న మెన్స్ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు సుమారు రూ. 50 కోట్ల నగదు బహుమతి అందించనుంది.
టైటిల్ సొంతం చేసుకున్న జట్టు రూ. 13 కోట్లు (1.6 మిలియన్ అమెరికన్ డాలర్లు) దక్కిం చుకోనుండగా, రన్నరప్‌గా నిలిచిన విజేత ప్రైజ్‌మనీలో సగం రూ.6.5 కోట్లు (800000 అమెరికన్ డాలర్లు) సొంతం చేసుకుంది. సెమీఫైనల్స్‌కు చేరుకున్న జట్లు రూ. 3.25 కోట్ల చొప్పున ఖాతాలో వేసుకోనున్నాయి. సూపర్ 12 దశలో నిష్క్రమించిన జట్లకు రూ. 56 లక్షల చొప్పున ఇవ్వనున్నారు. తొలి రౌండ్లో నిష్క్రమించిన జట్టు రూ.32 లక్షలు నగదు బహుమానం అందు కోనుంది. ఇక తొలి రౌండ్లో, సూపర్ 12 దశలో జట్టు సాధించిన ప్రతి విజయానికి రూ. 32 లక్షల ప్రైజ్ మనీ ఐసీసీ ఇవ్వనుంది. 16 జట్లు పోటీపడుతున్న ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ రెండు రౌండ్లలో నిర్వహించనున్నారు. తొలి రౌండ్లో ఎనిమిది జట్లు పోటీపడతాయి. నమీబియా, శ్రీలంక, నెదర్లాండ్స్, యుఏఈ (గ్రూప్-ఏ), వెస్టిండీస్, స్కాట్లాండ్, ఐర్లాండ్, జింబాబ్వే (గ్రూప్-బి) సూపర్ 12లో బెర్త్ కోసం పోరాడనున్నాయి. గ్రూప్ దశలో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్ 12 రౌండ్‌కు చేరుకుంటాయి. సూపర్12లో అఫ్గనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికాలు ఉన్నాయి.