Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బొటానికల్ గార్డెన్‌కు రూ.40 లక్షల నిధులు
నవతెలంగాణ, హైదరాబాద్ : రన్ ఫర్ పీస్ ఆద్యంతం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. సుమారు రెండు వేల మంది రన్లో పాల్గొన్నారు. 10కె రన్లో చంద్రాశ్, అల్ఫోన్స్, నవ్య, పింకీలు విజేతలుగా నిలువగా.. 10కె రన్ (60 ఏండ్ల పైబడిన) విభాగంలో శ్రీనివాసరావు, సారథిలు విజేతలుగా నిలిచారు. గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా రన్ ఫర్ పీస్ నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు సంతోశ్ కుమార్ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. రన్‌ను ఓ పండుగలా నిర్వహించిన బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్‌ను అభినందించిన సంతోశ్.. తన ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలను బొటానికల్ గార్డెన్ అభివృద్దికి ప్రకటించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, అటవీ అభివృద్ది కార్పోరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డిలు సైతం తమ నిధుల నుంచి రూ.10 లక్షల చొప్పున గార్డెన్ అభివృద్దికి ఇస్తామని ప్రకటించారు. బొటానికల్ గార్డెన్ అభివృద్ధికి రూ.40 లక్షలు కేటాయించిన ప్రజాప్రతినిధులకు వాక్సర్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపాడు. కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు బాలకృష్ణ, శ్రీనివాస్, ఏవీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.