Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణాఫ్రికాతో వన్డేలకు జట్టు ప్రకటన
ముంబయి : ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో శతకంతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న యువ సంచలనం రజత్ పటిదార్. ఐపీఎల్ జోరును దేశవాళీ సర్క్యూట్లో కొనసాగించిన పటిదార్.. ఇటీవల న్యూజిలాండ్ -ఏతో వన్డే సిరీస్‌లో అదరగొట్టాడు. తొలిసారి జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టును ఆదివారం ఎంపిక చేశారు. ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ మేరకు రజత్ పటిదార్‌కు పిలుపు అందించింది. సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్‌కు నాయకత్వ పగ్గాలు దక్కగా.. శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. తెలుగు తేజం, యువ బ్యాటర్ తిలక్ వర్మకు సెలక్షన్ కమిటీ నిరాశ మిగిల్చింది. న్యూజి లాండ్-ఏతో వన్డే సిరీస్‌కు సైతం తిలక్‌ను పక్కనపెట్టిన సెలక్షన్ కమిటీ.. ముంబైకర్ పృథ్వీ షాను సైతం ఎంపిక చేయకపోవటం గమనార్హం. భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే అక్టోబర్ 6న లక్నోలో జరుగనుంది. 9న రాంచీలో రెండో వన్డే, 11న న్యూఢిల్లీలో చివరి వన్డే జరుగనుంది.
భారత వన్డే జట్టు : శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రజత్ పటిదార్, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోరు, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్.