Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సౌరాష్ట్రపై 8వికెట్ల తేడాతో ఘన విజయం
రాజ్కోట్: ఇరానీకప్-2022 టైటిల్ను రెస్టాఫ్ ఇండియా జట్టు కైవసం చేసుకుంది. ఓవర్నైట్ స్కోర్ 8వికెట్ల నష్టానికి 368పరుగులతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర జట్టు 380పరుగులకు ఆలౌటైంది. ఉనాద్కట్(89) టాప్ స్కోరర్. దీంతో రెస్టాఫ్ ఇండియా జట్టు 105పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. చివరి రెండు వికెట్లను కుల్దీప్ సేన్ పడగొట్టాడు. స్వల్ప లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన రెస్టాఫ్ ఇండియా జట్టు 2 వికెట్లు కోల్పోయి 105పరుగులు ఘన విజయం సాధించింది. ప్రియాంక్ పంఛల్(2), యశ్ ధుల్(8) నిరాశపరిచినా.. అభిమన్యు ఈశ్వరన్(63), శిఖర్ భరత్(27) మరో వికెట్ పడకుండా మ్యాచ్ను ముగించారు. ఉనాద్కట్కు రెండు వికెట్లు లభించగా.. రెస్టాఫ్ ఇండియా జట్టు రికార్డుస్థాయిలో 29వ సారి ఇరానీకప్ టైటిల్ను కైవసం చేసుకుంది.