Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురుషుల 200మీ. పరుగులో అమ్లన్ రికార్డు
అహ్మదాబాద్: గుజరాత్ వేదికగా జరుగుతున్న 36వ జాతీయ క్రీడల్లో రికార్డులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజి 100మీ. హర్డిల్స్‌లో 12.79సెకన్లలో గమ్యానికి చేరి ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మంగళవారం పురుషుల 200మీ. పరుగులో అమ్లన్ బోర్గోహైన్ రికార్డు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అస్సాంకు చెందిన అమ్లన్ 200మీ. పరుగును 20.55సెకన్లలో పూర్తి చేసుకొని ప్రథమస్థానంలో నిలిచాడు. ఈ రికార్డు ఇంతకుముందు అమ్లన్ పేర(21.06సెకన్లు)గా ఉండగా.. తాజాగా తన రికార్డును తిరగరాసింది. ఇక అభిన్ దెవడిగా(కర్ణాటక), మహ్మద్ అజ్మల్(సర్వీసెస్) రజత, కాంస్యాలను గెలిచారు. ఇక మహిళల 200మీ. పరుగులో అస్సాంకు చెందిన హిమాదాస్‌కు రజత పతకం లభించింది. ఆమె 23.06సెకన్లలో గమ్యానికి చేరి రెండోస్థానంలో నిలువగా.. ఈ విభాగంలో అర్చన సుశేంద్రన్కు స్వర్ణ పతకం దక్కింది.
35కి.మీ. రేస్‌వాక్‌లో రాంబాబు జాతీయ రికార్డు
పురుషుల 35కి.మీ. రేస్ వాక్‌లో జాతీయ రికార్డు నమోదైంది. మంగళవారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాంబాబు 35కి.మీ. రేస్ వాక్‌ను 2గంటల 36నిమిషాల 34సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో ఇంతకుముందు జాతీయ రికార్డు ఉన్న 2గంటల 40:16నిమిషాల రికార్డును బ్రేక్ చేశాడు. ఇదే విభాగంలో హర్యానాకు చెందిన జునేద్ ఖాన్ 2గంటల 40:51నిమిషాలు రెండోస్థానంలో నిలిచి రజత పతకం కైవసం చేసుకున్నాడు.