Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవార్డును అందుకున్న ముంతాజ్ ఖాన్
న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ యువ క్రీడాకారిణి ముంతాజ్ ఖాన్ ఎఫ్ఐహెచ్ రేజింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైంది. 19ఏళ్ల ముంతాజ్ జూనియర్ హాకీ ప్రపంచకప్ టోర్నీ అత్యధిక గోల్స్ కొట్టిన క్రీడాకారిణుల జాబితాలో మూడోస్థానంలో నిలిచింది.
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉంది. ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ను ప్రారంభించిన ముంతాజ్.. లక్నో వేదికగా జరిగిన ప్రపంచకప్ టోర్నీ 6మ్యాచుల్లో 8గోల్స్ కొట్టింది. ఇందులో ఒక హ్యాట్రిక్ గోల్స్ కూడా ఉన్నాయి. ఈ టోర్నమెంట్లో భారత్ నాల్గోస్థానంలో నిలిచింది. కాంస్య పతక పోటీకి ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2-2తో మ్యాచ్‌ను డ్రా చేసుకోవడంలో ముంతాజ్ కీలకపాత్ర పోషించింది. కానీ షూటౌట్లో భారత్ ఓటమిపాలై నాల్గో స్థానానికే పరిమితమైంది. అవార్డు లభించడం పట్ల ముంతాజ్ మాట్లాడుతూ.. ఈ అవార్డును గెలుచుకున్నానంటే నమ్మలేకపోతున్నాని, ఈ ఏడాదిలో మా టీమ్ అద్భుత ప్రదర్శనను కనబర్చిందని, ఈ అవార్డును అంకితం చేస్తున్నానని ప్రకటించింది.