Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టి20 ప్రపంచకప్‌కు 16మంది అంపైర్లు: ఐసిసి
దుబాయ్: ఆస్ట్రేలియా వేదికగా ఈ నెలలో జరిగే టి20 ప్రపంచకప్‌కు 16మందితో కూడిన అంపైర్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) మంగళవారం ప్రకటించింది. ఐసిసి ప్రకటించిన 16మంది అంపైర్లలో భారత్‌కు చెందిన నితిన్ మీనన్‌కు చోటు లభించింది. ఐసిసి ఎలైట్ ప్యానల్లో ఉన్న అంపైర్లలో భారత్‌నుంచి మీనన్ ఒక్కరే. మొత్తం 20మందిలో మ్యాచ్ రిఫరీలుగా నలుగురు కొనసాగనున్నారు. అర్హత పోటీలనుంచే వీరంతా అంపైర్ బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఆ తర్వాత జరిగే సూపర్-12 నుంచి 16మంది అంపైర్ల మాత్రమే టోర్నమెంట్ ముగిసే వరకు విధులను నిర్వర్తించనున్నారు. 2021 ఐసిసి టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు నితిన్ మీనన్‌తోపాటు కుమార ధర్మసేన, రిచర్డ్ కొటెల్బర్గ్, మారిస్ ఎరాస్మస్ బాధ్యతలను నిర్వర్తించారు.
మ్యాచ్ రిఫరీలు: ఆండ్రూ పైక్రాఫ్ట్, క్రిస్టోఫర్ బ్రాడ్, డేవిడ్ బూన్, రంజన్ మధుగలే
అంపైర్లు: ఆండ్రియన్ హౌల్డ్స్టోక్, అలీమ్ ధార్, అహసాన్ రాజా, క్రిస్టోఫర్ బ్రౌన్, క్రిస్టోఫర్ గఫనీ, జోల్ విల్సన్, కుమార ధర్మసేన, లాంగ్టన్ రూసెరే, మారిస్ ఎరాస్మస్, మిఛెల్ గాఫ్, నితిన్ మీనన్, పాల్ రిఫిల్, పాల్ విల్సన్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కిటెల్బ్రో, రోడ్నీ టక్కర్.