Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుఎఇపై 104పరుగుల తేడాతో భారత్ గెలుపు
- మహిళల ఆసియాకప్ టోర్నీ
ఢాకా: బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియాకప్ టోర్నీలో భారత జట్టు వరుసగా మూడో విజయాన్ని సొంతం చేసుకుంది. యుఏఇతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 104పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు మేఘన(10), రీచా ఘోష్(0) నిరాశపరిచినా.. దీప్తి(64), రోడ్రిగ్స్(75నాటౌట్), పూజ(13నాటౌట్) బ్యాటింగ్‌లో రాణించారు. దీంతో టీమిండియా మహిళలజట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 178పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. భారీ లక్ష్యంతో ఇన్నింగ్స్ ఆరంభించిన యుఎఇ జట్టు నిర్ణీత 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 4వికెట్లు నష్టపోయి కేవలం 74పరుగులే చేయగల్గింది. గైక్వాడ్‌కు రెండు, హేమలతకు ఒక వికెట్ లభించాయి. వరుసగా మూడో విజయాన్ని సాధించిన టీమిండియా.. సెమీస్‌కు చేరువలో నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జెమీమా రోడ్రిగ్స్‌కు లభించగా.. భారత్ పాయింట్ల పట్టికలో 6పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. హర్మన్‌ప్రీత్ సేన శుక్రవారం పాకిస్తాన్‌తో తలపడనుంది.
మరో మ్యాచ్‌లో శ్రీలంక జట్టు 49పరుగుల తేడాతో థారులాండ్‌ను ఓడించింది. శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 156పరుగులు చేస్తే.. థారులాండ్ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 5వికెట్లు కోల్పోయి 107పరుగులే చేయగల్గింది.
స్కోర్‌బోర్డు..
ఇండియా మహిళల ఇన్నింగ్స్: మేఘన (సి)సతీశ్ (బి)గార్ 10, రీచా ఘోష్ (సి)జైన్ (బి)ముఘల్ 0, దీప్తి (సి)గౌర్ (బి)కుట్టే 64, హేమలత (రనౌట్) ఎగోడేజ్ 2, రోడ్రిగ్స్ (నాటౌట్) 75, పూజ (సి)ఎగోడేజ్ (బి)ఓఝా 13, నవ్‌గైర్ (నాటౌట్) 10, అదనం 4. (20ఓవర్లలో 5వికెట్ల నష్టానికి) 178పరుగులు.
వికెట్ల పతనం: 1/3, 2/17, 3/20, 4/148, 5/161
బౌలింగ్: ముఘాల్ 4-0-31-1, మహిక గౌర్ 4-0-27-1, మహేశ్ 3-0-26-0, ఓజా 3-0-27-1, కృషీ శర్మ 3-0-29-0, సమీర 1-0-13-0, నటాషా 1-0-11-0
యుఎఇ మహిళల ఇన్నింగ్స్: సతీశ్ (రనౌట్) స్నేV్‌ా రాణా 1, ఓఝా (సి)వస్త్రాకర్ (బి)గైక్వాడ్ 4, ఎగోడేజ్ (నాటౌట్) 30, నటాషా (బి)గైక్వాడ్ 0, కృషీ శర్మ (సి)రోడ్రిగ్స్ (బి)హేమలత 29, ముఘాల్ (నాటౌట్) 6, అదనం 4. (20 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి) 74పరుగులు.
వికెట్ల పతనం: 1/1, 2/5, 3/5, 4/63
బౌలింగ్: రేణుక సంఘ్ 4-0-17-0, రాజేశ్వరి గైక్వాడ్ 3-0-20-2, పూజ వస్త్రాకర్ 4-0-15-0, దీప్తి శర్మ 3-0-11-0, స్నేహ రాణా 3-0-7-0, హేమలత 3-0-8-1.