Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022
జైపూర్ : తొలిసారి భారత్‌లో జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ టైటిల్‌ను భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సారథ్యంలోని ఇండియా క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. జైపూర్‌లో జరిగిన ఫైనల్లో బిల్వారా కింగ్స్‌పై ఇండియా క్యాపిటల్స్ 104 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. లెజెండ్స్ లీగ్ క్రికెట్ టైటిల్ విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా క్యాపిటల్స్ 20 ఓవర్లలో 211/7 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాస్ టేలర్ (82), మిచెల్ జాన్సన్ (62) ఆరో వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యంతో కదం తొక్కటంతో, ఆరంభంలో తడబడినా ఇండియా క్యాపిటల్స్ భారీ స్కోరు నమోదు చేసింది. ఛేదనలో బిల్వారా కింగ్స్ నిరాశపరిచింది. 18.2 ఓవర్లలో 107 పరుగులకే ఆ జట్టుకు కుప్పకూలింది. ఇండియా క్యాపిటల్స్ బౌలర్లు పవన్ (2/27), పంకజ్ (2/14), ప్రవీణ్ (2/19)లు రాణించారు.