Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, పాక్ ఢీ నేడు
సిల్హట్ : ఆసియా కప్ (2022)లో భారత్, పాకిస్థాన్ మెన్స్ జట్లు యుఏఈలో రెండు సార్లు ముఖాముఖి పోరులో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించగా.. ఇప్పుడు ఆ సవాల్‌ను అమ్మాయిలు స్వీకరించనున్నారు!. ఆసియా కప్ గ్రూప్ దశలో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలతో టీమ్ ఇండియా జోరు మీదుండగా.. మరోవైపు పాకిస్థాన్ జట్టు అంత బలంగా కనిపించటం లేదు. దీంతో నేటి మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. పాకిస్థాన్‌తో గత ఐదు ముఖాముఖి మ్యాచుల్లో టీమ్ ఇండియా ఎదురులేని విజయాలు నమోదు చేసింది. టాప్ ఆర్డర్లో స్మృతీ మంధాన, సబ్బినేని మేఘన, షెఫాలీ వర్మ సహా జెమీమా రొడ్రిగస్‌లు భీకర ఫామ్‌లో ఉన్నారు. ఆల్‌రౌండర్లు దీప్తి శర్మ, హేమలత సైతం మంచి టచ్‌లో ఉన్నారు. భారత్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు పాకిస్థాన్ నేడు మ్యాచ్ బరిలోకి దిగనుంది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ మధ్యాహ్నాం 1 గంటలకు ఆరంభం కానుంది. స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మ్యాచ్ ప్రసారం అవుతుంది.
పాక్‌కు షాక్ : పొరుగు దేశం భారత్‌తో కీలక మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు దిమ్మదిరిగే షాక్ తగిలింది. పసికూన థారులాండ్ చేతిలో ఆ జట్టు అనూహ్య పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ మహిళలు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేశారు. ఛేదనలో థారులాండ్ గొప్ప తెగువ చూపించింది. 19.5 ఓవర్లలోనే 6 వికెట్లకు 117 పరుగులు సాధించింది. ఆసియా కప్‌లో అతిపెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకుంది.