Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు వేదికగా శుక్రవారం నుంచి ప్రొ కబడ్డీ సీజన్-9 ప్రారంభం కానుంది. ఇండోర్‌లోని శ్రీ కంఠీరవ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ దబాంగ్ ఢిల్లీ-యు ముంబ జట్ల మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సీజన్ కబడ్డీ లీగ్ ప్రారంభమౌతుంది. బెంగళూరు బుల్స్-తెలుగు టైటాన్స్, యు యోథా-జైపూర్ జట్ల మధ్య తొలి రోజే మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం శ్రీ శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్, బెలవడి, పూణేలలో 27నుంచి తర్వాత లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. సీజన్-9 ప్రొ కబడ్డీలో ఈసారి 12జట్ల మధ్య మొత్తం 66మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతి జట్టు శుక్ర, శనివారం మూడేసి మ్యాచ్‌లు జరగనున్నాయి. సీజన్-9లో బెంగాల్ వారియర్స్, బెంగళూరు బుల్స్, దబాంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్, హర్యానా స్టీలర్స్, జైపూర్ పింక్ప్యాంథర్స్, పట్నా పైరెట్స్, పుణెరి పల్టన్స్, తమిళ్ తలైవాస్, తెలుగు టైటాన్స్, యు ముంబ, యుపి యోథా జట్లు ఈసారి బరిలో దిగనున్నాయి.