Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్‌కు బయల్దేరిన భారత్
ముంబయి : 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాకు బయల్దేరింది. స్వదేశంలో వరుసగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలపై టీ20 సిరీస్‌లను 2-1తో గెలుపొందిన రోహిత్ సేన.. గురువారం ముంబయి నుంచి మెల్బోర్న్కు బయల్దేరింది. ప్రయాణానికి ముందు క్రికెటర్లు, సహాయక సిబ్బందితో కూడిన గ్రూప్ ఫోటోను బీసీసీఐ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా గాయంతో టోర్నీకి దూరం కాగా.. అతడి స్థానంలో జట్టులోకి వస్తాడని అనుకుంటున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమి జట్టుతో కనిపించలేదు. అతడి ఫిట్నెస్ను పరిశీలించిన అనంతరం సెలక్టర్లు తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
దీంతో టీ20 ప్రపంచకప్‌కు భారత్ 14 మందితో కూడిన జట్టుతోనే కంగారూ గడ్డపై అడుగుపెట్టనుంది. ఓ వారం రోజుల్లో బుమ్రా స్థానంలో మరో పేసర్‌ను బీసీసీఐ ఆస్ట్రేలియాకు పంపించే అవకాశం కనిపిస్తోంది. మెగా ఈవెంట్లో భారత్ అక్టోబర్ 23న పొరుగు దేశం పాకిస్థాన్‌తో తలపడనున్న సంగతి తెలిసిందే. అంతకముందు వార్మప్ మ్యాచుల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో భారత్ తలపడనుంది.