Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టి20 లీగ్
- బరిలోకి ఐపిఎల్, స్టార్ ఆటగాళ్లు..
- ఆంధ్ర కెప్టెన్‌గా శ్రీకర్ భరత్
ముంబయి: దేశవాళీ క్రికెట్ సయ్యద్ ముస్తాక్ అలీ టి20 లీగ్ ఈనెల 11నుంచి ప్రారంభం కానుంది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా జరగని దేశవాళీ క్రికెట్ టోర్నీ అక్టోబర్ 11నుంచి నవంబర్ 5వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్లో రాష్ట్రజట్లు బరిలోకి దిగనుండగా.. మొత్తం 38జట్లు ఈసారి బరిలోకి దిగనున్నాయి. ఎలైట్ గ్రూప్-డిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ జట్టు ఇండోర్ వేదికగా తన తొలి మ్యాచ్‌ను 11న సౌరాష్ట్రతో తలపడనుంది. 12న హిమాచల్‌ప్రదేశ్‌తో, 16న నాగాలాండ్, 18న బీహార్, 20న గుజరాత్, 22న బరోడాతో తలపడనుంది. ఇక ఎలైట్ గ్రూప్-బిలో ఉన్న హైదరాబాద్ జట్టు జైపూర్ వేదికపై తన తొలి మ్యాచ్‌ను 11న పంజాబ్‌తో మ్యాచ్ ఆడనుంది.